పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు సామజిక మధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెడుతూనే ఉంటుంది.అయితే వారి పేర్లు ప్రస్తావించకుండా ఇండైరెక్టుగా ఎవరో ఒకరిని ఉద్దేశించి సంచలన పోస్టులు పెడుతుంది పూనమ్ కౌర్.అయితే గత కొద్ది రోజులుగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఆ పోస్టులో ఏముందయ్యా అంటే..సినిమా పరిశ్రమలో ఓ పేరున్న డైరెక్టర్ ఒక లేడీని ప్రెగ్నెంట్ ని చేసి ఆమె జీవితం మొత్తం నాశనం చేశాడు... అయితే ఈ విషయం తెలుసుకున్న మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇందులో కలగజేసుకొని ఆ పంజాబీ హీరోయిన్ కి మద్దతుగా నిలిచారు. 

కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఆ అమ్మాయిని మోసం చేసి గర్భవతిని చేశాడు. అయితే ఈ ఇష్యులో నన్ను అలాగే ఓ నటుడు రాజకీయ నాయకుడిని అవసరం లేకుండా కూడా మా పేర్లు ప్రస్తావించి అనవసరంగా మమ్మల్ని అందులోకి లాగి ఇబ్బంది పెట్టారు.అయితే అతను మాత్రం లీడర్ గా మారిన నటుడు మాత్రం కాదు అంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. కానీ ఈ ఇష్యూలో పూనమ్ కౌర్ ఎవరి పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం.

అయితే గత కొద్ది రోజుల నుండి త్రివిక్రమ్ పై పరోక్ష కామెంట్లు చేస్తున్న పూనమ్ కౌర్ ఈ ట్వీట్ కూడా త్రివిక్రమ్ ని ఉద్దేశించే పెట్టిందా లేక వేరే ఎవరి గురించి అయినా పెట్టిందా అని మాట్లాడుకుంటున్నారు.ఇక పూనమ్ డైరెక్టర్ అని చెప్పింది కాబట్టి ఆ డైరెక్టర్ త్రివిక్రమే కావచ్చు అంటున్నారు చాలా మంది పూనమ్ కౌర్ పెట్టిన ట్వీట్ చూసి..మరి ఇంతకీ పూనమ్ కౌర్ పెట్టిన  ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: