ఇక దానికోసమే కొత్త కథలను వింటూ సురేష్ బాబు ఎప్పటికప్పుడు చిరంజీవికి చెబుతూనే వస్తున్నాడట. ఇక రీసెంట్ గా ఒక స్టార్ రైటర్ చెప్పిన కథ సురేష్ బాబుకి నచ్చడంతో చిరంజీవికి కూడా తెలియజేశారట. చిరంజీవి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి చిరంజీవి, వెంకటేష్ ఎవరి సినిమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు.కాబట్టి వాళ్ల సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకురావాలని సురేష్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలాఉండగా మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ 2025 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొమ్ముకాస్తున్నారు. చిరంజీవి ఫాంటసీ యాక్షన్ డ్రామా విశ్వంభరతో వస్తున్నాడు, మరోవైపు వెంకీ పల్లెటూరి డ్రామాతో అలరించబోతున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట విశ్వంభర దర్శకత్వం వహిస్తుండగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.