మహేష్ బాబు .. ఆ పేరు పలుకుతుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆరు అడుగుల అందగాడు.. ఆ అందానికి తగ్గ ఎత్తు ..ఆ ఎత్తుకు తగ్గ బరువు.. వయసు పైబడి పోతున్న కూడా యంగ్ లుక్స్ లో కనిపిస్తూ కుర్ర బ్యూటీలను సైతం ఫిదా చేసేస్తున్నాడు. మహేష్ బాబుని ఆయన కొడుకు గౌతమ్ ని పక్కనపెడితే గౌతమ్ నే ఏజ్డ్ గా కనిపిస్తాడు . మహేష్ బాబు చాలా యంగ్ లుక్స్ లో కనిపిస్తూ అందరిని షాకింగ్ కి గురి చేస్తున్నాడు.


ప్రజెంట్ రాజమౌళి సినిమా కోసం తన ఫుల్ లుక్స్ ని మేకోవర్ చేసుకుంటున్నాడు. అస్సలు గుర్తుపట్టని విధంగా మారిపోతున్నాడు.  కచ్చితంగా రాజమౌళితో మహేష్ బాబు ఓకే చేసిన సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . ఇలాంటి మూమెంట్ లోనే మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి ఒక్క వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో కృష్ణ కొడుకు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ సెటిల్ అయ్యాడు .



నిజానికి అందరికీ మహేష్ బాబు సినిమా అంటే మొదటగా గుర్తొచ్చేది రాజకుమారుడు . ఈ సినిమాలో చాక్లెట్ బాయ్ లుక్స్ లో బాగా అదరగొట్టాడు. కానీ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే మాత్రం అందరికీ మురారి సినిమానే గుర్తొస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మహేశ్ ను దగ్గర చేసిన సినిమా ఇదే.  అసలు మహేష్ బాబు చేయకపోతే మురారి సినిమా ఎటు పోయేదో ..? అన్న కామెంట్స్ కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి .



ఆ స్క్రిప్ట్ కి మహేష్ బాబు బాగా సూట్ అయ్యాడు అని మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా పొగిడేస్తూ ఉంటారు.  కాగా మహేష్ బాబు "మురారి" సినిమా హిట్ అయిన మూమెంట్లో పలువురు ఆయనను ప్రశంసిస్తూ ఉంటే చాలా ఎమోషనల్ అయిపోయారట . తండ్రిని హత్తుకొని గుక్క పట్టి ఏడ్చేసారట . ఒక స్టార్ హీరోగా మారడానికి మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా "మురారి"నే కావడం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: