అలనాటి తరం హీరోలలో శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారు స్టార్ హీరోలుగా ఎదుగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అయిన రామకృష్ణ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. 1960లో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనే సినిమాతో తన సినీకేరియని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న రామకృష్ణ అప్పట్లో నటి గీతాంజలి వివాహం చేసుకున్నారనే విధంగా ఒక వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన రామ కృష్ణ కొడుకు శ్రీను ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.



శ్రీను మాట్లాడుతూ తన తండ్రి మొదటి భార్య భీమవరంలో ఉన్న అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.. చెన్నై నుంచి వచ్చిన తర్వాత నటుడుగా ఆయన సినీ ప్రయాణం మొదలయ్యిందని ఆ తర్వాత పార్వతి అనే ఒక నటితో తనకి పరిచయం ఏర్పడిందని.. ఆమె కూడా ఒక నటి అని విన్నాను కానీ తన తండ్రి వివాహం చేసుకున్నారనేది నిజం. ఇద్దరు కూడా కలిసే ఉండేవారని తెలిపారు.


కొంతకాలం తర్వాత తన తండ్రికి ఆమెకు కుదరకపోవడం వల్ల విడిపోవడం జరిగిందని అప్పుడు తన తండ్రి తాను కొన్న ఇంటిని ఆమెకే ఇచ్చేసి కేవలం కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసారని తెలిపారు అప్పటినుంచి తన లైఫ్ ను మరొకసారి కొత్తగా మొదలు పెట్టారని మొదటి భార్యకి నాన్నగారు అన్యాయం చేశారని విషయం కేవలం అవాస్తవమంటూ తెలిపారు. తన తండ్రి ఇచ్చిన ఇంటిపైన ఆమెకు రెంట్ల రూపంలో డబ్బులు వచ్చేవని తెలిపారు. ఆమె ఉన్నంతవరకు ఆమె లైఫ్ కూడా హ్యాపీగానే వెళ్ళిపోయిందని పార్వతి గారికి పిల్లలు లేరని ఆ తర్వాత ఆమె ఆ ఇంటిని తన బంధువులకు ఇచ్చేశారని తెలిపారు రామకృష్ణ కొడుకు శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: