పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పవన్ చాలా సినిమాలు కమిట్ అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ వీలు దొరికినప్పుడల్లా షూటింగ్ చేసి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. చివరగా బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్. సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో "ఓజీ"  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ . పోస్టర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పవన్‌ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్‌ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్‌ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్‌ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్‌ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి.

బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ల సంతోషం ఏలా ఉంటుందో.. ఓజీ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు, ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజీత్. నిజానికి అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. ఈ పాటికే ఓజీ ఫీవర్ ఇండియాను తాకేసేది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పవన్ రాజకీయాలతో బిజీ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు.ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఏఐ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను ఏ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారో... టీజర్‌తో చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్ తెగ వైరల్ అవుతుంది.ఇదిలావుండగా ఈ సినిమాలో చాలా మంది నటులు నటిస్తున్నారు. ఇక సాహో సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేక పోయిన సుజిత్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచేలా ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి తిరిగి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఓజీ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

#OG