పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు మూవీ ఇప్పటికీ ఒక సెన్సేషనే..ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఇండస్ట్రీలో మరో మాస్ హీరో దొరికేసాడు అని అందరూ మాట్లాడుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భాషా, వేషం,డాన్స్,డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి అందర్నీ ఆకట్టుకున్నాయి.. అయితే దేశముదురు సినిమాకి మొదటి ఛాయిస్ అల్లు అర్జున్ కాదట.. వేరే హీరోని అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్,పూరి జగన్నాథ్ లు..అయితే ఆ హీరో దగ్గరికి వెళ్లి స్టోరీ మొత్తం చెప్పాక సన్యాసిని ప్రేమించడం ఏంటి అని రిజెక్ట్ చేశారట. మరి ఇంతకీ దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. దేశముదురు సినిమాలో హీరోగా అల్లు అర్జున్..హీరోయిన్ గా హన్సిక నటించింది. అయితే ఈ సినిమాలో హన్సిక సన్యాసి పాత్రలో చేసింది.

 ఇక ఈ సినిమా కథని ముందుగా పూరి జగన్నాథ్ అక్కినేని సుమంత్ తో తీద్దాం అనుకున్నారట. అంతేకాదు ఇంటికి వెళ్లి మరీ స్టోరీ  మొత్తం చెప్పారట.అయితే స్టోరీ మొత్తం విన్న అక్కినేని సుమంత్ సినిమా స్టోరీ చాలా బాగుంది.కానీ సన్యాసిని ప్రేమించడం బాలేదు. సన్యాసిని లవ్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అని ఒకే ఒక్క చిన్న పాయింట్ ని పట్టుకొని సినిమాను రిజెక్ట్ చేశారట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది.

ఇక ఈ సినిమా చేసి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.అయితే దేశముదురు సినిమా అవకాశం ముందుగా నాకే వచ్చిందని,కానీ సన్యాసిని ప్రేమించే క్యారెక్టర్ బాలేదని నేను రిజెక్ట్ చేసాను అంటూ అక్కినేని సుమంత్ ఓ ఇంటర్వ్యూ కూడా చెప్పారు. ఇక ఈ మాటలు విన్న నెటిజన్స్ ఏ సన్యాసులను ప్రేమించకూడదా.. అంటూ రవితేజ ఇడియట్ మూవీ లెవెల్ లో డైలాగులు చెప్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: