మెగాస్టార్ చిరంజీవి 48 ఏళ్ల sl సినీ కెరియర్ లో ఎన్నో ఎshsi పల్లాలు , ఎన్నో విజయాలు చూశారు. అలాగే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు . అలాగే తన సినిమాల్లో ఎక్కువ రియల్ స్టంట్స్  చేసే చిరు .. కొన్ని కొన్ని సార్లు ఆయన చేసే రియల్ స్టండ్స్ కు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి . కొన్ని సీన్స్ లో హీరోలకు చేయాలని ఉన్నా  దర్శకులు , నిర్మాతలు ఇతర యూనిట్ సభ్యులు దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్స్ లో డూప్ తో పెట్టి కానిచ్చేస్తారు . అలాగే సినిమాల్లో కూడా ఎక్కువ రిస్కీ అనుకున్న సన్నివేశాలు మాత్రమే డూప్ తో తెరకెక్కిస్తుంటారు...దర్శక నిర్మాతలు. అలానే ఇక చిరంజీవికి ఒక వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా డూప్ గా నటిస్తున్నారు.


 చిరు తన సినిమాల్లో చేయాల్సిన రిస్క్‌ సన్నివేశాలను ఆయనే చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన చిరంజీవికి బాగా దగ్గరయ్యాడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్. ఈయనకు ప్రేమ్ కుమార్ డాన్సింగ్ గ్రూప్ అనే చిన్న డాన్సింగ్ కంపెనీ కూడా ఉంది.  ఈయన తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి నేను డూప్‌గా నటిస్తున్న అన్న విషయాన్ని చెప్పక వచ్చాడు.  అలాగే పలు సినిమాలకు ఈయన కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. చిరంజీవి విషయానికొస్తే గత సంవత్సరం వచ్చిన వాల్తేరు వీరయ్య , బోళా శంకర్ సినిమాలతో పలకరించాడు .

 మరోవైపు ఈ ఏడాది ఈ పద్మ విభ భూషణ్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బోళా శంకర్ తో భారీ డిజాస్టర్ అందుకున్న చిరు ‘విశ్వంభర’ తో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని గట్టి ప్లానింగ్ తో వస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా. పలువురు బాలీవుడ్ అగ్ర నటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇక మరి చిరంజీవి ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: