సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. మలయాళీ సినిమాలతో.. సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో రానాకి జోడిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.  ఆ తరువాత సంయుక్త మీనన్ నటించిన బింబిసారా..సినిమా కూడా మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని.. సంయుక్తకు వరుసగా రెండు విద్యను ఇచ్చింది. ఇక ఆ తరువాత ధనుష్ తో ..చేసిన సార్ సినిమా .. ఈ హీరోయిన్ కి హ్యాట్రిక్ విజయాలను అందించింది. 

అయితే సంయుక్త మీనన్  కి నటన.స పరంగా వందకి వంద మార్కులు వేయచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో హీరో పాత్ర కన్నా సంయుక్త మీనన్   తన పాత్ర హైలెట్గా నిలవడమే కాకుండా.. సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.  ఇక ఇలా వరుస హిట్స్ తో ఈ మలయాళ ముద్దుగుమ్మకు గోల్డెన్ హీరోయిన్ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరొక లక్కీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా నేడు గ్రాండ్ లాంఛ్ అవుతోంది. చింతకాయల రవి సినిమా డైరెక్టర్ యోగేష్ అలియాస్ యోగి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భీమ్లా నాయక్ లో జోడిగా నటించారు. రానాతో పాటుగా మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: