ఈ మూవీ ప్రమోషన్ కోసం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఒక విషయాన్ని బయట పెట్టాడు. త్వరలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు. ‘అందాల రాక్షసి’ మూవీతో నటుడిగా మొదలుపెట్టి ఆతరువాత ‘చి ల సౌ’ మూవీతో దర్శకుడుగా మారి ఆపై నాగార్జునతో ‘మన్మథుడు 2’ మూవీ తీసి ఫెయిల్యూర్ డైరెక్టర్ గా మారిన రాహుల్ ప్రస్తుతం రష్మిక తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
‘గర్ల్ ఫ్రెండ్’ టైటిల్ తో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదలకు రెడీ కానున్నట్లు వస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తూ ఉండటంతో ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీ ఇంకా విడుదల కాకుండానే రాహుల్ సుధీర్ బాబుతో మూవీ చేయడానికి ప్రాయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సుధీర్ బాబు ‘జటాధర’ అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈసినిమాను చేస్తూ సుధీర్ రాహుల్ రవీంద్ర తో సినిమాను చేస్తాడా లేదంటే ఆమూవీ పూర్తి అయిన తరువాత రాహుల్ తో సినిమా ఉంటుందా అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు..