మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత అటెండ్ అయ్యింది . ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న రానా దగ్గుబాటి తన బ్రదర్ అని చెప్పారు. ఇక చైతు - సమంత విడాకుల కు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. విడాకుల తర్వాత అక్కినేనితో బంధుత్వం ఉన్న అందరికీ సమంత దూరం అవుతారనే అందరూ అనుకున్నారు. ఇటీవల కొండా సురేఖ ఒక అడుగు ముందుకు వేసి నాగార్జున, నాగ చైతన్యను కించపరిచేలా చేసిన మాటలు పెద్ద దుమారం రేపాయి.
ఇక అప్పుడే సమంత కొండా సురేఖ కు కౌంటర్ ఇచ్చారు. చైతు తో తన విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదని అప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడు జిగ్రా వేడుకలో మాట్లాడిన మాటలు కొండా సురేఖకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ అని టాలీవుడ్ వర్గాలతో పాటు అక్కినేని అభిమానులు అందరూ భావిస్తున్నారు. చైతు తో తనకు విడాకులు అయినా సరే రానా తనకు అన్న య్య అని చెప్పడంతో పాటు ఈవెంట్ అంతా సమంత నవ్వుతూ కనిపించారు. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల అక్కినేని కుటుంబంతో వారి .. బంధువులతో తన స్నేహం.. బంధుత్వం విషయం లో ఎలాంటి మార్పులు ఉండవు అన్న విషయాన్ని ఆమె మరోసారి నొక్కి చెప్పినట్లైంది.