ఒక సినిమాను ఎంత బాగా రూపొందించాము అనే దాని కంటే ఆ సినిమాకు ఎంత బాగా ప్రమోషన్లను చేసాము అనేదే చాలా ముఖ్యం. ప్రమోషన్లను అద్భుతమైన స్థాయిలో చేసినట్లు అయితే ప్రేక్షకులకు సినిమాలపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఇక థియేటర్కు వెళ్లి సినిమా చూడాలి అనే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. సినిమాను అద్భుతంగా తీసి ప్రమోషన్లను సరిగ్గా చేయకపోయినా సినిమా ఒకటి వచ్చింది అనేది కూడా జనాలకి తెలియకుండా థియేటర్లలోకి వస్తుంది. అలాగే థియేటర్ల నుండి వెళ్ళిపోతుంది.

అదే సినిమాకు ప్రమోషన్లు కనుక అద్భుతంగా చేసినట్లయితే ఆ సినిమా కూడా బాగుంటే ఆ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. కానీ ప్రమోషన్లు అనేవి ఎప్పుడూ ఒక స్థాయి వరకే ఉండాలి. అలా స్థాయి దాటిన ప్రమోషన్ల వల్ల సినిమా బృందాలు అభాస పలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు సినిమా యావరేజ్ గా ఉంది అని మేకర్స్ కు తెలిసిన కూడా సినిమా బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇలాంటి కామెంట్ చేయడం వల్ల సినిమా విడుదల అయ్యాక అది ఆ స్థాయిలో లేనట్లయితే ప్రేక్షకుల నుండి మరింత నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో నరసింహుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నిర్మాత 200 సెంటర్స్ 100 డేస్ అనే పోస్టర్ను విడుదల చేశారట. ఇక నిర్మాత ఒత్తిడితో ఈ సినిమా యూనిటీ ఈ పోస్టర్లను విడుదల కూడా చేసిందట. ఇక చివరకు ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. దానితో ఈ మూవీ యూనిట్ మొత్తం అభాసపలు అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: