సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కొంతమంది బుద్ధిగా చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే ..మరి కొంత మంది మాత్రం తల - తోక లేని రీజన్స్ చెప్పి మా మధ్య బాండింగ్ కుదరటం లేదూ అని..తోటకూర కట్ట అంటూ విడాకుల వరకు వెళ్తున్నారు . కొంతమంది విడాకులు కూడా తీసేసుకుంటున్నారు . అయితే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు బన్నీ - స్నేహ రెడ్డిల జంట .
వీళ్లది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిన విషయమే. వీళ్లది ప్రేమ వివాహం . బన్నీ - స్నేహ రెడ్డి ప్రేమించుకొని వాళ్ళ ఇళ్లల్లో ఒప్పించుకొని మరి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి కోసం అప్పట్లో కోట్లు ఖర్చు చేశాడు అల్లు అరవింద్ అంటూ వార్తలు వినిపించాయి. ఒక పాప - ఒక బాబుతో లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చాలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కుని హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేశాడు .
త్వరలోనే పుష్ప2 సినిమాతో ఆ ట్రోలింగ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా పక్కాగా ప్లాన్ తో ముందుకు వస్తున్నాడు అల్లు అర్జున్ . ఇలాంటి మూమెంట్లోని అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ - స్నేహారెడ్డి టూ రొమాంటిక్ కపుల్. అది అందరికీ తెలిసిందే . స్నేహ రెడ్డి - అల్లు అర్జున్ కోసం చాలా చాలా పెద్ద శాక్రిఫైజే చేసిందట . నిజానికి స్నేహ రెడ్డికి ఎప్పటినుంచో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటూ చాలా ఆశపడేదట .
తన ఇంట్లో ఆలా హీరోయిన్ అవ్వడానికి ఒప్పుకోలేదట . అంతేకాదు స్నేహారెడ్డి మొదటి నుంచి చాలా ట్రెండీగా మోడరన్ గా ఉంటుంది . పెళ్లి తర్వాత కూడా చాలా మోడరన్ గా మారి.. అటువంటి దుస్తులు వేసుకోవడం మనం చూసాం . పోనీలే అమ్మ గారింట్లో నా ఆశ తీరలేదు.. కనీసం అత్త గారింట్లో అయిన నా ఆశ తీరుతుందిలే అని అనుకునే లోపే అల్లు అర్జున్ మదర్ స్నేహ కి షాకింగ్ కండీషన్ పెట్టిందట. అల్లు ఫ్యామిలీలో ఇంటి కోడలు సినిమాల్లోకి వెళ్ళకూడదు అంటూ ముందుగానే ఒక కండిషన్ పెట్టారట . ఆ కండిషన్ యాక్సెప్ట్ చేసి మరి తాను కావాలి అనుకున్న హీరోయిన్ ఆశను వదులుకొని బన్నీ కోసం బిగ్ శాక్రిఫైజ్ చేసి మరి అల్లు అర్జున్ ప్రేమను పొందింది స్నేహ రెడ్డి . నిజంగా ఇది ఆమెకు బన్ని పై ఉన్న ప్రేమకు నిదర్శనమనే చెప్పాలి . ప్రజెంట్ ఈ జంట ఎంత అన్యోన్యంగా, హ్యాపీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!!