సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హాట్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కి కూడా సెపరేట్గా బెడ్ రూమ్ ఉండడం అంటే చాలా చాలా ఇష్టమట . అయితే చిన్నతనంలో వాళ్ళ ఫైనాన్స్ పొజిషన్ బాగా లేక ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె చాలా చాలా టఫ్ పొజిషన్ ఫేస్ చేసిందట . ఈ విషయాని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక ఏజ్ వచ్చాక రష్మిక మందన్నా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక ..మెల్లిగా మెల్లిగా అన్ని కొనుక్కుంటూ స్టాండర్డ్ పొజిషన్లో సెటిల్ అయ్యారట .
అంతేకాదు రష్మిక మందన్నా చేతికి డబ్బు వచ్చాక తాను చిన్నతన,లో పొందలేని ఆనందాలని.. మిస్ చేసుకున్న చిన్న చిన్న సరదాలని మళ్లీ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. రష్మిక కి చిన్నప్పటి నుంచి ఒక కోరిక బలంగా ఉండేదట . తన ఫేవరెట్ హీరో రజనీకాంత్ ఫొటోస్ రూమ్ నిండా నింపేసుకుని తన రూమ్ ను డిజైన్ చేసుకోవాలి అని ఆశపడిందట . చిన్నఏజ్ లో ఆ కోరిక తీరలేదు. తాను కష్టపడి డబ్బులు సంపాదించి ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిలో తన బెడ్ రూమ్లో తన ఫేవరెట్ స్టార్ హీరో రజనీకాంత్ చిన్నప్పటి ఫొటోస్ నుంచి ప్రజెంట్ ఉండే ఫొటోస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ గా వాల్ కి స్టిక్ చేసి తన కోరికను తీర్చేసుకుందట . రష్మిక మందన్నా చాలా టాలెంటెడ్ గర్ల్ . అంతేకాదు మొండి పిల్ల కూడా అనుకున్నది ఎట్లైనా సాధిస్తుంది అంటూ ఫ్యాన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు..!