ఛీ..ఛీ.. ఎవ్వరైనా సరే ..ఏ అమ్మాయి అయినా సరే.. ప్రభాస్ కి చెల్లిగా వర్ణిస్తే ఒప్పుకుంటుందా..? నో వే.. చచ్చినా అలా ఒప్పుకోదు.. పెళ్లి అయిపోయిన ఆంటీలు కూడా ప్రభాస్ కి అక్క చెల్లి అంటే నో నో అంటూ మొహం ముడుచుకుంటూ ఉంటారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ . రెబల్ స్టార్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

ఫస్ట్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక తెలుగు హీరోగా సంచలన రికార్డులను నెలకొల్పిన ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.  ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..? కాగా ప్రభాస్ కి సంబంధించిన ఏదో ఒక వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూనే వస్తుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన మ్యాటర్ గురించి అయితే ఎక్కువగా మనం వింటూ వస్తూ ఉన్నాము.

కాగ మొదటి నుంచి ప్రభాస కి తన తల్లి అంటే చాలా రెస్పెక్ట్ . అంతేకాదు తన తల్లి చెప్పిన మాటని ఎప్పుడు కూడా జవదాటడు . ఒకానొక ఇంటర్వ్యూలో తల్లి కోసం వంట కూడా చేశాను అని చెప్పుకొచ్చాడు . అయితే ప్రభాస్ మదర్ ఫ్యామిలీ ఫంక్షన్ లో సరదాగా పాల్గొన్న గేమ్ ఇంటర్వ్యూలో "ఆయనకు పర్ఫెక్ట్ జోడి ఎవరు..?" అంటే మాత్రం 'త్రిష' అంటూ చెప్పుకు వచ్చిందట . అంతేకాదు "ఏ హీరోయిన్ తో చేస్తే ప్రభాస్ మీకు నచ్చలేదు ..?"అని అడిగిన క్వశ్చన్ కు .."నాకు ఎందుకో దీక్ష సేధ తో ప్రభాస్ ని చూస్తే సిస్టర్ లా అనిపించింది" అంటూ చెప్పుకు వచ్చిందట . వాళ్ళిద్దరి హైట్ కు ఆ విధంగా మ్యాచ్ అయింది అంటూ ప్రభాస్ తల్లి గారు సరదాగా ఫ్యామిలీ ఫంక్షన్ లో చెప్పుకొచ్చారట . ప్రభాస్ - దీక్ష సేథ్ "రెబల్" మూవీలో కలిసి నటించారు . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . మరి ముఖ్యంగా ప్రభాస్ కెరియర్ డిజాస్టర్ గా మారడానికి ఈ సినిమా కూడా ఒక కారణమని ప్రభాస్ ఫ్యాన్స్ బాగా బాధపడ్డారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: