సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు . డైరెక్టర్స్ - హీరోస్ - హీరోయిన్స్ - ప్రొడ్యూసర్స్ చాలా చాలా మంది ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ ఉంటారు . అయితే అందరి ఫ్రెండ్ షిప్ లోకి బాగా పాపులారిటీ అందుకున్న ఫ్రెండ్ షిప్ మాత్రం ప్రభాస్ గోపీచంద్-ప్రభాస్ అనే చెప్పాలి . ఇద్దరూ ఇండస్ట్రీ హీరోలే . ఇద్దరు ఒకే టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . అయితే ప్రభాస్ క్లిక్ అయినంత ఫాస్ట్ గా గోపీచంద్ క్లిక్ అవ్వలేకపోయాడు .
ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గోపీచంద్ కి ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది . ఇప్పుడు అంత పెద్ద లేదనే చెప్పాలి . కాగా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే ప్రభాస్ - గోపీచంద్ కలిసి వర్షం సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికి ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్ మూవీ అనే చెప్పలి. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా రాకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు.
అయితే చాలామంది డైరెక్టర్ లు ప్రభాస్ హీరోగా నటించే సినిమాల్లో విలన్ గా గోపీచంద్ కు రోల్ ఆఫర్ చేశారు . కానీ గోపీచంద్ మాత్రం విలన్ రోల్స్ చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యాయి ఆ ఆఫర్స్ అన్నిటిని రిజెక్ట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే.. స్వయానా ప్రభాసే బాహుబలి సినిమాలో భల్లాల దేవుడి పాత్ర కోసం రాజమౌళి చేత గోపీచంద్ ని అడిగించారు. అయినా సరే గోపీచంద్ మాత్రం అస్సలకి ఒప్పుకోలేదట . ప్రభాస్ కోసం ఎలాంటి పనైనా చేసే గోపీచంద్ తాను తీసుకున్న డెసిషన్ కి ఎప్పుడు కట్టుబడే ఉంటాడు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ కూడా గోపీచంద్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఉంటాడు . వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా అయినా రాకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూద్దం మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో..???