టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని వస్తే.. మరి కొంతమంది... తమకు సొంత కాళ్లపై నిలబడి... సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని... టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 49 ఏళ్లు దాటినా కూడా.. యంగ్ హీరోలనే కనిపిస్తాడు మహేష్ బాబు.


మిల్క్ బాయ్ లాగానే ఇప్పటికి ఉంటాడు మహేష్ బాబు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు..సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ యాడ్ కోసం..ప్రిన్స్ మహేష్ బాబు.. మేకప్ వేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా కెమెరామెన్ మహేష్ బాబుకు సంబంధించిన...  విగ్గు పట్టుకున్నట్లు... కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మహేష్ బాబుది...రియల్ జుట్టు కాదని... నకిలీ చుట్టూ అంటూ... కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.


మొదటి నుంచి మహేష్ బాబు విగ్గు తో మేనేజ్ చేస్తున్నాడని... సెటైర్లు పేల్చుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో... మహేష్ బాబు అంటే పడని వారు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు.... భారీ జుట్టుతో కనిపించాడు మహేష్ బాబు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే మహేష్ బాబు ఇలా చుట్టూ... పెంచాడని కొంతమంది ప్రచారం చేశారు.


ఇక ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. అతి త్వరలోనే రాజమౌళి అలాగే మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవల గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. అయితే గుంటూరు కారం సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్లను మాత్రం రాబట్టగలిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: