మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ కు గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఈ మూవీ లో చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే చాలా వరకు రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా చేసిన హీరోలకు అపజయాలు వస్తాయి అనే ఒక టాక్ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయింది.

అందుకు అనుగుణం గానే ఇప్పటికీ చాలా సంఘటనలు ఇలా జరిగాయి. ఇకపోతే ఇంత వరకు రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా తర్వాత దాదాపు చాలా మంది హీరోలకి ఫ్లాప్ లు వచ్చాయి.  కానీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ "ఆచార్య" సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది.

తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమా తర్వాత చరణ్ కు ఆరెంజ్ మూవీ తో భారీ ఫ్లాప్ వచ్చింది. ఆ తర్వాత రచ్చ సినిమాతో తిరిగి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత చరణ్ "ఆచార్య" మూవీ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక రచ్చ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ మూవీ తో చరణ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: