ఈ మధ్యకాలంలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.  తమ ఫేవరెట్ హీరో పలానా హీరోయిన్ పక్కనే నటించాలి అని ..అల్లాటప్ప హీరోయిన్స్ తమ హీరో పక్కన నటించకూడదు అని.. పరమ చెత్త కంటెంట్ ఉన్న సినిమాలలో తమ ఫేవరెట్ హీరో నటిస్తే ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు అభిమానులు. అలాంటి సినిమాలు సందర్భాలు కూడా మనం చూసాం . అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మెగా హీరోలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు .

మెగా ట్యాగ్ ఉపయోగించుకొని వచ్చిన హీరోలు అందరూ కాస్తో కూస్తో లాభపడిన వారే.  కాగా మెగాఫ్యాన్స్ కి ఎంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ గా  ఇష్టపడుతుంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్ కూడా చేశారు . కాగా గతంలో మెగా ఫ్యాన్స్ ఓ హీరోయిన్ విషయంలో రామ్ చరణ్ ను బాగా ఇబ్బంది పెట్టేశారు . ఆమె మరెవరో కాదు అమలాపాల్ .

చరణ్ హీరోగా అమలాపాల్ హీరోయిన్గా నటించిన సినిమా నాయక్ . ఈ సినిమా పరలేదు అనే టాక్ దక్కించుకుంది.  మరి ముఖ్యంగా చరణ్ పర్ఫామెన్స్ బాగున్న.. కథపరంగా అదే విధంగా చరణ్ పక్కన హీరోయిన్లను చూస్ చేసుకునే మ్యాటర్ లో డైరెక్టర్ ఫ్లాప్ అయ్యాడు అంటూ తెగ ట్రోల్ చేశారు జనాలు.  కాజల్ హీరోయిన్గా అంటే ఓకే కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో పక్కన డస్కీ బ్యూటీ అమలాపాల్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు అంటూ డైరెక్టర్ ను అప్పట్లో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు.

మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో "శుభలేఖ రాసుకున్న కలలో ఎప్పుడో " అనే సాంగ్ రీమేక్  చేయడం మెగా ఫ్యాన్స్ కు బాగా మండేలా చేసింది . అంతేకాదు అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది . అయితే అప్పట్లో చాలా మంది మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కి  అమలాపాల్ నీకు సూట్ అవ్వలేదు .. మరో సినిమాలో నటించదు అంటూ కూడా సజెషన్స్ ఇచ్చారు.  రాంచరణ్ తన అభిమానుల సజెషన్స్ తీసుకున్నాడో.. లేక నిజంగానే సూట్ కాలేదని భావించాడొ.. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా అమలాపాల్ కు ఛాన్స్ వచ్చినా కూడా రామ్ చరణ్ రిజెక్ట్  చేశాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: