ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కంటే పక్క భాష హీరోయిన్స్ ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలోనైనా సరే తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడమే మానేశారు కొందరు డైరెక్టర్లు . మరీ ముఖ్యంగా కన్నడ - బాలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్స్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా తెలుగులో సినిమాలో నటిస్తూ ఉన్నారు.
రీసెంట్ గానే జాన్వి కపూర్ బడా హీరో ఎన్టీఆర్ సరసన "దేవర" అనే సినిమాలో నటించింది. దేవర సినిమాతోనే ఆమె డెబ్యూ ఇవ్వడం అందరికీ తెలిసిందే. కాగా అంతకుముందు మరొక బడా హీరోయిన్ అలియా భట్ సైతం ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అలియాభట్ క్యారెక్టర్ చిన్నదైనా సరే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించిన కొద్దిసేపు అందరి మనసులను బాగా ఆకట్టుకునే విధంగా చేసింది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఆలియా భట్ తెలుగులో ఒక సినిమాలో నటించాల్సి ఉందట . ఆ సినిమా మరేంటో కాదు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయిన "బాహుబలి".
ఎస్ ..బాహుబలి సినిమాలో తమన్నా పాత్రలో ముందుగా రాశిఖన్నాను అనుకున్నారట. అయితే ఆమె ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ ని అనుకున్న రాజమౌళి ఒకానొక మూమెంట్లో అలియా భట్ కూడా ఈ పాత్రకు సూట్ అవుతుంది అంటూ అనుకున్నారట . అలియా భట్ ను అప్రోచ్ అవ్వగా అలియాభట్ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా ఉండాలి అనుకున్న అలియా భట్ కు ఇలా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడం కారణంగానే ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి దే. వుడు రాసిపెట్టిన రాత ను ఎవరు తప్పించలేరు తెలుగులో రాజమౌళి డైరెక్షన్లోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అని రాసిపెట్టి ఉండింది. అందుకే బాహుబలితో మిస్ అయిన ఛాన్స్ ఆర్ఆరార్ తో కొట్టేసింది అంటూ అలియా ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!