కాగా పాన్ ఇండియా స్టార్స్ అనగానే మనకి బాగా గుర్తొచ్చే 4 పేర్లు ప్రభాస్ - అల్లు అర్జున్ - తారక్ - రామ్ చరణ్ . అయితే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఉంది . అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉంటారు ..కొత్త కొత్త రకాల స్టైల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు . రాంచరణ్ ఎటువంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా చెప్పేస్తూ ఉంటాడు . ప్రభాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..ఆల్ రౌండర్ . తారక్ విషయం వచ్చేసరికి సూపర్ డాన్సర్ అనే చెప్పాలి . మరి ముఖ్యంగా తారక్ ల డ్యాన్స్ చేసే వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలోనే లేడు అని ..చాలామంది స్టార్స్ చెప్పుకొచ్చారు .
వార్ 2 సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న తారక్ ను బాలీవుడ్ స్టార్స్ కూడా బాగా పొగిడేస్తున్నారు. అయితే ఎటువంటి స్టెప్స్ అయిన అవలీల గా డాన్స్ చేసే తారక్ ఒక సినిమా పాట విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడట. మనందరికీ తెలిసిందే తారక్ అసలు డాన్స్ ప్రాక్టీస్ చేయడు . కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ ను డైరెక్ట్ గా ఓకే చేసేస్తూ ఉంటారు. హీరోయిన్స్ మాత్రం ఎక్కువ టేక్స్ తీసుకుంటూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు . అయితే యమదొంగ సినిమా విషయంలో మాత్రం చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేశాడట . మరి ముఖ్యంగా "నాచోరే నాచోరే" సాంగ్ లో స్టెప్స్ ఎంత కష్టంగా ఉంటాయో తెలిసిందే. ఆ స్టెప్స్ చాలా వరకు ఈజీగా వేయగలిగాడు. కానీ ఫ్లోర్ మూమెంట్ మటుకు తారకు చాలా ఇబ్బంది కలిగించిందట . మరీ ముఖ్యంగా రైట్ టు లెఫ్ట్ మూమెంట్స్ ఈజీగానే చేసిన లెఫ్ట్ టు రైట్ మూమెంట్ కి వచ్చేసరికి ఆ ఫ్లోర్ స్టెప్ చాలా టఫ్ సిచువేషన్ క్రియేట్ చేసిందట . ఒకానొక టైం లో తారక్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట. ఫైనల్లీ ఆయన కష్టం ఫలించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.