దాదాపుగా రూ.270 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రైట్స్ కి భారీ డిమాండ్ పెరిగిపోయిందట. ఇండియాలోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా కూడా పుష్ప-2 చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూఎస్ఏ లో ఈ సినిమా 15 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇంత రాకుంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు డబ్బులు సైతం చెల్లించాల్సి ఉంటుందట.
అందుకే ఇంత భారీ ధరకు అక్కడ అమ్ముడుపోయినట్లు టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం పైన చాలా నమ్మకంతో ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో ఎన్నో సినిమాలను నిర్మించారు మైత్రి మూవీస్. ఇక అల్లు అర్జున్ రేంజ్ కూడా పుష్ప చిత్రంతో భారీగా పెరగడంతో పుష్ప-2 సినిమాకి మరింత ప్లస్ అయిందని కూడా అభిమానులు భావిస్తున్నారు. హిందీ వెర్షన్లో రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్మినట్లుగా టాక్ అయితే వినిపిస్తున్నది. మరి ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప-2 సినిమా పైన రూ.800 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తున్నారు. మరి ఎలాంటి రికార్డులను సైతం తిరగరాస్తుందో చూడాలి.