సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గుంటూరు కారం తో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు పూర్తిగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మహేష్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పెద్ద జుట్టు, గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇటీవలే భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆ సమయంలో మహేష్ లుక్, ఫ్యాషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.రాజమౌళి , మహేష్ బాబు  సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా కోసం మహేష్  కొత్త లుక్ ఎగ్జైట్‌మెంట్‌ను సృష్టిస్తోంది. అయితే రాజమౌళి ఇప్పటికే పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు.

నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. .ఇక ఇప్పుడు  మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ వరల్డ్ లో  పెను సంచలనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆర్టిస్టు లను ఎంపిక చేసిన రాజమౌళి ఈ సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా స్టార్టింగ్ రోజే సినిమాకి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయాలని తద్వారా సినిమా మీద అంచనాలు పెంచాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు.   మరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాని రెగ్యూలర్ షూటింగ్ కి తీసుకెళ్లే ముందు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని పెట్టి ఈ సినిమా కు సంభందించిన ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: