ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 111.85 కోట్ల కలక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 92.80 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.
సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 71.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.
బాహుబలి 2 : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా 68 కోట్ల కలెక్షన్ల వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.
దేవర పార్ట్ 1 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటివరకు 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 56.07 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.