కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ధరించిన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజాగా ఈ బ్యాగుకు సంబంధించి ధర కూడా వైరల్ గా మారుతున్నది. ఐకానిక్ ఎల్ వి మోనోగ్రామ్ ను కలిగి ఉన్న ఈ పసుపు, నలుపు రంగు బ్యాగు ధర అక్షరాల రూ.3,81,841 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని తర్వాత చూసిన తర్వాత.. మహేష్ బాబు లగ్జరీ పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాషన్ ఐకానిక్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు తన స్టైల్ ని ఎవరు కాపీ చేయలేరని అంతగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ పార్టీలకు ధరించి దుస్తులు కూడా చాలా స్టైలిష్ గా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మహేష్ బాబు స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు అభిమానులు. ఇక రాజమౌళితో సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటనతో త్వరలోనే రాబోతున్నది. మరి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల లిస్టు విడుదల చేస్తారేమో చూడాలి.