సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టయన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఇక ఈ చిత్రంలోఅమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 10 అనగా రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజినీ సినిమా అంటే.. తెలుగు ప్రేక్షకులు కూడా ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదిలావుండగా ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయిన ఒక వయస్సు వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గడం సర్వసాధారణం.రజనీకాంత్ విషయం లో కూడా అదే జరిగింది. ఆయన వయస్సు ఇప్పుడు 73 ఏళ్ళు ఉంటాయి. రజనీ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ అంతా థియేటర్స్ ముందు క్యూ కడతారు.. రిలీజ్ కు ముందు రోజే ఎక్కడ లేని హంగామా చేస్తారు.. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే ఆ సినిమా కలెక్షన్స్ రేంజ్ కు వెళ్తాయి. నార్మల్ టాక్ వచ్చినా కూడా సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ పక్కా.. అంతటి క్రేజ్ వున్న రజనీ సినిమాకు ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది..రజనీ వెట్టియాన్’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రం గానే జరిగాయి.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 12 కోట్ల 56 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇప్పటికీ విజయ్ నటించిన బీస్ట్ చిత్రానిదే ఆల్ టైం రికార్డు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని రజినీకాంత్ కొట్టడం ఇప్పట్లో కష్టమే. ‘నాన్ రజినీ రికార్డ్స్’ అని పిలబడే స్థాయి నుండి తన తోటి స్టార్ హీరో ఓపెనింగ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోవడాన్ని ఆయన ఇమేజ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.మరోవైపు తెలుగు మూవీ లవర్స్ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'వేట్టయన్' మూవీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: