సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ టీజీ జ్ఞానవెల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వేట్టయాన్. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ కూడా కేవలం పాటలతోనే ట్రైలర్ తోనే మంచి హైప్స్ ఏర్పరిచింది వేట్టయాన్. మంజు వారియర్ ఈ చిత్రంలో రజనీకాంత్ కి జోడిగా నటించడంతో పాటుగా సాంగ్ లోని స్టెప్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నా ఈ ముఖ్యంగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. అమితాబచ్చన్ అంటివా కీలకమైన పాత్రలో నటించినప్పటికీ. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది మరి ఏ మేరకు సక్సెస్ అయ్యిందో తెలుసుకుందాం.


పలువురు నెట్టిజెన్స్ తెలిపిన ప్రకారం రజనీకాంత్ గత చిత్రాలలో కంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించబోతున్నారంటూ తెలుపుతున్నారు. ఈ సినిమా ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ గా తీశారని అమితాబచ్చన్ సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయని తెలుపుతున్నారు. ఇందులో మరొకసారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రజనీకాంత్ తన స్టైల్ ని చూపించారంటూ తెలియజేస్తున్నారు. మొదటి భాగం అంతా కూడా జస్ట్ ఓకే అన్నట్లుగా నేటిజన్స్ తెలియజేస్తున్నారు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.



ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ని మాత్రం కాస్త ఆసక్తికరంగా చూపించిన సెకండాఫ్ పైన పెద్దగా ఆసక్తి చూపించేలా తీయలేదట. అనిరుద్ కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ గా మారినట్లు తెలియజేస్తున్నారు. రజనీకాంత్ అభిమానులు కోరుకున్నట్టుగా ఇందులో ఎలాంటి హై మూమెంట్ సన్నివేశాలు లేవని వాపోతున్నారు. రజిని అభిమానులు ట్విట్టర్లో  బాగుందని తెలుపుతున్న విజయ్ అభిమానులు మాత్రం చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు.వేట్టయాన్ చిత్రంలోని సన్నివేశాలు ట్విస్టులు కూడా ఊహించగలిగినవేగా కనిపిస్తాయట. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్తో ఉన్నారట. ఓవరాల్ గా ఈ సినిమా కమర్షియల్ అంశాన్ని బలవంతంగా చూపించడానికి ప్రయత్నించాలనే విధంగా టాక్ వినిపిస్తోంది. మరి కొంతమంది ఇది రజినీకాంత్ చిత్రం కాదంటూ కూడా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: