తమిళ నటుడు సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు అనేక భాషలలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రెండు విభిన్న కాలాల మధ్య ఈ సినిమా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశా పటాని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా పరవాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజంగానే ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 50 కోట్లకు అమ్ముడుపోయినట్లయితే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్ల మేర షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంటుంది.

మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితేనే ఈ స్థాయి కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: