నిశ్చితార్థ కార్యక్రమానికి అటు నారా కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరు కానున్నారని తెలుస్తోంది. కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉన్న నారా రోహిత్ ఎట్టకేలకు పెళ్లి దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నారా రోహిత్ పెళ్లి తేదీ, వధువు వివరాలు త్వరలో వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.
హైదరాబాద్ లోనే నిశ్చితార్థ వేడుక జరగనుండగా ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారో చూడాల్సి ఉంది. నారా రోహిత్ పెళ్లి వేడుకకు సంబంధించిన వార్త అటు నారా, ఇటు నందమూరి కుటుంబ సభ్యులకు ఎంతో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రోహిత్ తో కలిసి ఒక సినిమాలో నటించిన అమ్మాయే పెళ్లికూతురు అని ప్రచారం జరుగుతోంది.
అయితే అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నారా రోహిత్ ప్రస్తుతం సుందరకాండ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో నారా రోహిత్ కచ్చితంగా సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నారా రోహిత్ ప్రస్తుతం తన సినిమాలకు పరిమితంగానే పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే. నారా రోహిత్ త్వరలో అధికారికంగా ఈ వివరాలను వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.