మలయాళ సినిమాల ఎఫెక్ట్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పైన ఎక్కువగా చూపుతోంది. ముఖ్యంగా కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు మన వాళ్ళు కూడా చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా చూపించడానికి ప్రయత్నించిన సినిమానే మా నాన్న సూపర్ హీరో వంటి సినిమా. సుధీర్ బాబు తనకేరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటనతో ప్రేక్షకులకు నేర్పిస్తూనే ఉన్నారు. సుధీర్ బాబు ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి మరి చేసిన సినిమా మా నాన్న సూపర్ హీరో.. మరి ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం.


అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్లో ఈ సినిమా రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా ఆర్ణ నటించినది. సాయాజీ షిండే కీలకమైన పాత్రలో నటించారు. రేపటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఓవర్సీస్ లో ముందుగానే విడుదలైన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుందట. ఈ సినిమా తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీ అన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అందుకు తగ్గట్టుగానే కదా కథనాన్ని కూడా డైరెక్టర్ ఎంతో చక్కగా రాసుకున్నారు. అయితే తను చెప్పాలనుకున్న కదా కథనంను డైరెక్టర్ ఎక్కడ కూడా డామినేట్ అవ్వకుండా చాలా చక్కగా తీశారు.



కానీ కథలో ఎమోషనల్ బాగా కనెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులోని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల చేత శభాస్ అనిపించేలా ఉన్నాయట. ఇక కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కవే క్లైమాక్స్ కూడా గుడ్ ఫీలింగ్ ఇస్తుందని ఓవరాల్ గా ఈ సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుందని కుటుంబ కథా చిత్రం వారు ఈ సినిమాని చూడవచ్చని నేటిజన్స్ తెలియజేస్తున్నారు. మరి దసరా రేసులో ఎన్నో స్థానంలో నిలుస్తుందో చూడాలి మరి. సుధీర్ బాబు మరొకసారి ఒక ఎమోషనల్ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించారని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: