మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. త్రిషమూవీ లో చిరు కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల కావడం కష్టం అని కొన్ని రోజుల క్రితం ఓ వార్త వైరల్ కాగా ఈ సినిమా దర్శకుడు వశిష్ట కచ్చితంగా ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల కానుంది అంటూ అనౌన్స్ చేశాడు. మళ్ళీ ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల కావడం కష్టం అని వార్తల వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విశ్వంభర సినిమా విడుదల కావడం కష్టం అని ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి నెలకు పోస్ట్ పోన్ చేయనున్నారు అని , అలాగే చిరంజీవి కుమారుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సినిమా కూడా డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ సినిమాను జనవరి 10 వ తేదీ కి షిఫ్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా విశ్వంభర మూవీ విడుదల తేదీన గేమ్ చేంజర్ మూవీ విడుదల కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: