తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన సినిమాలలో చాలా తక్కువ సినిమాలే మంచి విజయాలను అందుకున్న ఈయన ఎక్కువ శాతం డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ లలో నటిస్తూ రావడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం సందీప్ కిషన్ చాలా సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే సందీప్ కిషన్ ఈ సంవత్సరం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

అదేమిటి అంటే ఈ సంవత్సరం సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వర్ష బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీ లోని నిజమే చెబుతున్నా , హమ్మ హమ్మ అనే పాటలు అద్భుతమైన స్థాయిలో వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సాంగ్స్ కూడా 100 మిలియన్ వ్యూస్ ను సాధించాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ధనుష్ హీరోగా రూపొందిన రాయన్ అనే మూవీ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో సందీప్ కిషన్ , ధనుష్ కి తమ్ముడు పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సందీప్ కిషన్ పై ఒక పాట ఉంది. ఇకపోతే ఈ మూవీలో సందీప్ కిషన్ పై వాటర్ ప్యాకెట్ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ కూడా 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇలా సందీప్ కిషన్ ఈ సంవత్సరం నటించిన సినిమాలలోని ఆయన నటించిన మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఇలా సందీప్ కిషన్ ఈ సంవత్సరం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk