ప్రస్తుత రోజులలో అబ్బాయిలకు ఏ విధంగా అమ్మాయిలు తక్కువ కాదు అని అన్నిటిలలో నిరూపించుకుంటూ ఉన్నారు. ఇక కొన్ని సందర్భాలలో అయితే చివరకు మద్యపానం, సిగరెట్ తాగడం లాంటివి కూడా సర్వసాధారణం అయిపోయినాయి. ఈ తరుణంలో ఆరోగ్య నిపుణులు కూడా అమ్మాయిలు తాగితే తప్పులేదు కానీ.. సాధ్యమైనంత వరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది అని తెలియజేస్తున్నారు. వాస్తవానికి సిగరెట్స్ తాగడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడవచ్చు.. ఇక కొంతమంది ఒత్తిడితో కూడిన జీవితాలతో ఉపశమనం కోసం సిగరెట్ తాగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇదే తంతు బిగ్ బాస్ హౌస్ లో కూడా కొనసాగుతుంది.

గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా  స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు.. ఇక బిగ్ బాస్ 8 సీజన్లో కూడా పృథ్వి , నిఖిల్ దమ్ము కొడుతూ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వారాలుగా  హౌస్ చీఫ్ గా ఉన్న నిఖిల్ ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకేట్లు సిగరెట్లు కాల్చడం మనం చూడవచ్చు. ఈ వ్యసనం నుంచి బయట పడేందుకు సోనియా గట్టి ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా అనే స్మోకింగ్ మానేస్తే ఏది అడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. ఇక దీని గురించి స్పందించిన సోనియా.. నిఖిల్ సిగరెట్ తాగడానికి మాత్రమే చూపించారు. కానీ., బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది స్మోకింగ్ చేస్తారని.. అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేస్తారు కానీ వాళ్లను మాత్రం చూపించట్లేదని అన్నది. ఒక లేడీ హౌస్ మెట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతూ ఉంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరి ఆపేశాను. కానీ., ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరు అనేది మాత్రం నేను బయటకు చెప్పను అంటూ సోనియా తెలిపింది..

అయితే., ఇలా సోనియా మాటలు బిగ్ బాస్ ఆడియన్స్ కు ఓ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్బాస్ హౌస్ లో = దమ్ము కొట్టే లేడి కంటెస్టెంట్ ఎవరా అని తీవ్ర చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న విష్ణు ప్రియ సిగరెట్ తాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.. ఇందులో బిగ్ బాస్  హౌస్ లో ఒక కార్నర్ లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్న విష్ణు ప్రియ స్మోకింగ్ ఏరియాలో కూర్చొని దమ్ము కొడుతూ ఉన్నట్లు కనిపించింది. అయితే., ఆమె విష్ణుప్రియ కాదని చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. కొంతమంది విష్ణు ప్రియ ఫ్యాన్స్ అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు శేఖర్ భాషా సైతం విష్ణు ప్రియకు సిగరెట్ తాగే అలవాటు ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: