మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ ను దక్కించుకుంది . ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలు చాలా వరకు విజయాలను సాధిస్తూ వెళ్లడం తో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇక తెలుగులో మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళ్లో కూడా అనేక సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

ఇలా తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే సమంత టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీరి జీవితం కొంత కాలం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత కొంత కాలానికి వీరిద్దరు పరిష్కార అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు జీవిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సమంత సినిమాల స్పీడ్ ను చాలా వరకు తగ్గించింది. ఎక్కువ శాతం వెబ్ సిరీస్లలో నటిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తోంది.

ఇది ఇలా ఉంటే సమంత మునపటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో చాలాక్బరువు తగ్గింది. ఈమె బరువు తగ్గి బక్క చిక్కుపోయిన తన అందాలను మాత్రం అదిరిపోయే రేంజ్ లో మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె సన్నబడినట్లు క్లియర్గా అర్థం అవుతున్నా తన అందాలతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: