- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నట‌ సింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. బాలయ్య - విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే బాలయ్య తన కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించారు. ఒకే టైటిల్తో రెండు సినిమాలలో నటించారు. అందులో ఒక సినిమాలో బాలయ్యకు లక్కీ హీరోయిన్ విజయశాంతి జోడిగా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత చాలా ఏళ్లకు అదే టైటిల్ తో బాలయ్య మరో సినిమా చేశారు. ఆ సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. బాలకృష్ణ - విజయశాంతి కాంబినేషన్లో కథానాయకుడు సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు తరకెక్కిన ఈ సినిమాకు కే మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. అగ్ర నటి శారద కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేయటం ఈ సినిమాతో తొలిసారి కావటం విశేషం.


అయితే కథానాయకుడు సినిమా టైటిల్ విషయంలో చరిత్ర రిపీట్ అయింది. ఎన్టీఆర్ - జయలలిత జంటగా నటించిన కథానాయకుడు సినిమా 1969 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ కూడా తన తండ్రి టైటిల్ కథానాయకుడు వాడుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక బాలయ్య కథానాయకుడు సినిమా ఆరోజులలోనే హైదరాబాద్ - విజయవాడ లాంటి ప్రముఖ నగరాలలో 200 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య కథానాయకుడు సినిమాలో నటించిన 35 సంవత్సరాల తర్వాత మరోసారి అదే టైటిల్తో ఆయన సినిమా చేశారు. ఈ సారి తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా కథానాయకుడు - మహానాయకుడు సినిమాలో ఆయన నటించారు. తొలి భాగానికి కథానాయకుడు అనే టైటిల్ పెట్టారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: