చిత్ర పరిశ్రమ టర్నోవర్ రెండు దశబ్దాల క్రితమే వందల కోట్లకు చేరుకుంది. ఆ స‌మ‌యంలోనే కార్పొరేట్ సంస్థలు  కూడా ఈ వైపు అడుగులు కూడా వేసాయి. అలాగే కొన్ని వ్యాపారం సంస్థలు సినిమాలను కూడా నిర్మిస్తున్నాయి. ఇక అలాంటి వారిలో రతన్ టాటా సైతం చిత్ర పరిశ్రమ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఇన్ఫోమీడియా బ్యానర్ ను మొద‌లు పెట్టి ఈ బ్యానర్లో తెర్కెక్కిన తొలి చిత్రం  ఏత్ బార్.. అమితాబచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. ఏక్ బార్ రొమాంటిక్ సైక్లాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ భట్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా 2004 జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. స్టార్ నటులు నటించిన అప్పటికీ కథలో విషయం లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది కేవలం 7 నుంచి 8 కోట్ల వసూళ్ళునే రాబట్టింది.


ఏత్ బార్ నష్టాలు మిగిలిచిన నేపథ్యంలో ర‌త‌న్ టాటా మరలా సినిమా నిర్మాణ రంగం వైపు రాలేదు. ఏత్ బార్ 1996లో విడుదలైన అమెరికన్ మూవీ ఫియర్ స్ఫూర్తితో తెర్కెక్కించారు. ఏత్ బార్‌ మూవీ క‌థ‌ విషయానికి వస్తే రియా(బిపాసా బసు), ఆర్యన్(జాన్ అబ్రహం) ప్రేమించుకుంటారు. రియా తండ్రి డాక్టర్ రన్వీర్ మల్హోత్రా(అమితాబ్). ఆర్యన్ ఒక సైకోపాత్ అని, అతని వలన తన కూతురుకి ఆపద ఉందని రన్వీర్ తెలుసుకుంటాడు. రియాను ఎలాగైనా ఆర్యన్ నుండి కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. ఆర్యన్ పై రియాకి ఉన్న ప్రేమను ఎలా భగ్నం చేశాడు? సైకోపాత్ లవర్ ఆర్యన్ ప్రేయసి కోసం రన్వీర్ ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది కథ.


కాగా 84 సంవత్సరాల రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు .. సోమవారం అస్వస్థకు గురైన రతన్ టాటా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కు చేరారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను క్షేమంగానే ఉన్నానని ఆయన ఆసుపత్రిలో చేరిన అనంతరం తెలియజేశారు. అయితే చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. విలువలు కలిగిన పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకున రత‌న్ టాటా.. భారత పారిశ్రామిక రంగంలో విప్లమాతగా మార్పులు కూడా తెచ్చారు. రతన్ టాటా మృతిపై దేశ ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: