దాని చుట్టూ పచ్చని టీ తోటలు కూడా ఉన్నాయి. ఆ ల్యాండ్ విలువ దాదాపు 16 కోట్లకు పైగా ఉంటుందట. త్వరలోనే ఆరు ఎకరాల భూమిలో భారీ ఫామ్ హౌస్ కూడా నిర్మించనున్నారట చిరు. ఇప్పటికే రామ్ చరణ్ భార్య ఉపాసన చిరంజీవి కంటే ముందే ఊటీలో ఆస్తిని సంపాదించారు. చిరంజీవి కొన్న భూములు త్వరలోనే నిర్మాణం పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే డు చిరంజీవి ఇతర ఆస్తుల గురించి కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది. హైదరాబాద్ , బెంగళూరు వంటి మహానగరాలకు సమీపంలో ఫామ్ హౌస్ లో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దేవనహళ్లిలో ఆయనకి ఫామ్ హౌస్ ఉంది. సెలవులు, పండగలు సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లి సమయాన్ని గడుపుతారు. ఇక ఈ ఫామ్ హౌస్ కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది.
దీనికి సమీపంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పలువురు అగ్ర తార్లకు సంబంధించిన ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ విలువ సుమారు 40 కోట్లు పైగా ఉంటుందని కూడా గుసగసలు వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన వాణిజ్య , నివాస స్థలాలలో ఒకటిగా ఉన్న కోకాపేట్‌లో సొంత ఫామ్‌హౌస్‌ని కలిగి ఉన్నారు. 2019లో సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో ఆస్తి లోపల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫామ్‌హౌస్ ప్రధానంగా చర్చల్లోకొచ్చింది. నగర విస్తరణలో భాగంగా కోకాపేట భూములు ఖరీదైన వ్యవహారంగా మారాయి. దీంతో చిరంజీవి ఫామ్ హౌస్ విలువ చాలా ఎక్కువగా పెరిగిందని సమాచారం. దీనివిలువ దాదాపు 200 కోట్లు పైగా ఉంటుందని కూడా టాక్ వినిపించింది.