నాగచైతన్య పలు సినిమాల్లో నటించాడు ..హిట్స్ అందుకున్నాడు . కానీ బడా స్టార్ అన్న ట్యాగ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు . సినిమాలపరంగా కన్నా కూడా వ్యక్తిగత కారణాల చేతనే సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాడు నాగచైతన్య. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి రీసెంట్ గానే మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకున్నాడు .
అప్పటినుంచి సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు మారుమ్రోగిపోతుంది . కాగా శోభిత ధూళిపాళ్ల సిస్టర్ సమంత రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. ఆమె వెడ్డింగ్ ఫొటోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాళ్ల ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన తన సిస్టర్ సమంత పేరుని హైలెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చింది . అయితే నిన్న మొన్నటి వరకు నాగచైతన్య అంటే ఓ హీరోగాని అనుకున్న శోభిత సిస్టర్ సమంత.. పెళ్లి తర్వాత నాగచైతన్యను బావ అనే కొత్త పిలుపుతో పిలవాలా..? అంటూ జనాలు ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నాగచైతన్య లైఫ్ లో సమంత అన్న పేరుకు స్పెషల్ స్థానం ఉంది . ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య ఎప్పుడు కూడా సమంత పేరుని వింటే ఆయనకు తన పాత జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం నుంచి నాగచైతన్య ఎలా బయటపడతాడో చూడాలి..!?