యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన ఎన్ని విజయాలను అందుకుంటు ఎంత గొప్ప స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న ఒక్క విషయంలో మాత్రం ఈయన తన ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. అది ఎందులో అనుకుంటున్నారా ..? జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్ని బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఒక్క ఇండస్ట్రీ హిట్ మూవీ ని కూడా అందుకోలేకపోయాడు. 

గతంలో ఈయన నటించిన ఆది , సింహాద్రి సినిమాలు ఇండస్ట్రీ హిట్ కి చాలా దగ్గరగా వచ్చాయి. కానీ ఇండస్ట్రీ హిట్ ను అందుకోలేకపోయాయి. అలాగే ఆ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కానీ ఇండస్ట్రీ హిట్లను మాత్రం అందుకోలేదు. దానితో ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్టును కొట్టాలి అని భావిస్తున్నారు. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఝాన్సీ కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: