ఆ విషయాన్ని ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు జనాలు . తారక్ కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించాడు. అన్ని సినిమాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి. ప్రతి సినిమాకి స్పెషల్ కేర్ తీసుకుంటూ వస్తాడు. అయితే చాలామంది జనాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చిన సినిమా 'బృందావనం' . చాలా న్యాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు . మరీ ముఖ్యంగా సమంతని లవ్ చేస్తూ కాజల్ కోసం ఆమె ని లైఫ్ లో సెటిల్ చేయడానికి కాజల్ ఊరికి వెళ్లి అక్కడ అనుకోకుండా కాజల్ తోనే ప్రేమలో పడిపోతాడు.
అంతేకాదు ఆ తర్వాత జరిగే ట్విస్ట్ లు కూడా సినిమాకి హైలెట్గా ఉంటాయి . ఇంచుమించు ఇలాంటి కంటెంట్ తోనే ప్రభాస్ కెరియర్ లో కూడా ఓ సినిమా చేశాడు . ఆ సినిమానే 'మిస్టర్ పర్ఫెక్ట్'. మొదటి నుంచి తాను చెప్పిందే జరగాలి అనుకున్న ప్రభాస్ అనుకోకుండా కాజల్ తో ప్రేమలో పడడం ..ఆ తర్వాత ఆమెను దూరం పెట్టడం ..ఆ తర్వాత తాప్సి తో ప్రేమలో పడడం..తాప్సీ వాళ్ల ఇంటికి వెళ్లడం.. ఫైనల్లీ తన తప్పు తెలుసుకుని నిజమైన ప్రేమ కాజల్ దే అంటూ రియలైజ్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. ఈ రెండు కథలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అయితే అనుకోకుండా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే విధమైన కంటెంట్ తో వచ్చి సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు..!!