మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఆమె చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోవడంతో తిరిగి నిర్మాతగా స్థిరపడ్డారు నిహారిక. ఒకవైపు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో పని చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ నిర్మాతగా కూడా స్థిరపడుతున్నారు.
ఈమె పలు సినిమాలను వెబ్ సిరీస్ నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే. సుస్మిత కూడా ఒక సినిమాలో హీరోయిన్గా నటించారు.. సుస్మితను హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉండటంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించుకున్నారట. ఇక ఈమె హీరోయిన్గా ఓ సినిమాలో మాత్రం నటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవటంతో రిలీజ్ కాలేదట. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో సుస్మిత - ఉదయ్ కిరణ్ జంటగా ఓ సినిమాలో నటించారట. ఫస్ట్ హప్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మూవీ సెకండ్ హాఫ్ కంప్లీట్ కాకపోవటంతో ఈ సినిమా అలాగే మిగిలిపోయింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఉంటే సుస్మిత లైఫ్ మరో లాగా ఉండేదని కూడా పలువులు అంటున్నారు.