ఈనెల 11న ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఈ క్రమంలోనే జిగ్రా మూవీ ప్రమోషన్స్లో ఇటీవలే ఆలియా భట్ హైదరాబాద్ కి రావడం జరిగింది. అలాగే సమంత కూడా జిగ్రా ప్రమోషన్స్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి మరి ప్రమోషన్స్ చేసింది సమంత. ఇప్పటివరకు ఆరు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా అందుకున్నది ఆలియా భట్. ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా పేరు పొందిన ఆలియాభట్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోందట.
ఇక ఆలియా భట్ ఆస్తులు విషయానికి వస్తే కేవలం ఈమె పేరు మీద 500 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. పలు రకాల భవనాలు, వెంచర్స్ ,యాడ్స్ సినిమాల ద్వారా భారీగానే సంపాదిస్తోంది. ఆలియా భట్ వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టింది ముఖ్యంగా చిన్నపిల్లలకు దుస్తులకు సంబంధించిన వాటిని 2020లో ప్రారంభించింది. అలాగే సన్ షైన్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో కూడా ఏర్పాటు చేసుకుంది. అలాగే లండన్ ముంబై వంటి ప్రాంతాలలో కూడా భారీగానే ఆస్తులు కలిగి ఉన్నదట ఆలియా అవార్డు. ఇలా ఆలియాభట్ దగ్గర ఉన్న కారులు , లగ్జరీ ఇళ్ల వల్ల ఈమె ఆస్తి 500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. మరి ఆలియా నటిస్తున్న జిగ్రా సినిమా సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.