నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో గొప్ప సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. ఇక అదే విధంగా తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ గతిని కూడా ఎన్టీఆర్ మార్చారు. అలా ఎన్టీఆర్ తెలుగు సినిమా గతిని మార్చిన సినిమాలలో అడవి రాముడు  కూడా ఒకటి .. 1977 లో వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాల ఫార్ములాను మొత్తం మార్చేసింది. ఇక‌ కథ పాటలు అన్నీ హీరో చుట్టూ తిరుగుతూ అసలైన కథానాయకుడు హీరో అనే విధంగా చూపించిన సినిమా అడవి రాముడు.


సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. 1977 ఏప్రిల్ 28న ఈ సినిమా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ చరిత్రనే తిరగరాసింది . అదేవిధంగా ఎన్టీఆర్ స్టైల్ కూడా అంతా మారిపోయింది . ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఎన్టీఆర్ 55 ఏళ్ల వయసులో ఉన్న తన వయసును పట్టించుకోకుండా యువకుడిలా జయప్రదతో ఆడి పాడటమే కాకుండా నాటి యువతకి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ఎన్టీఆర్ స్టైల్ ను ఆనాటి యువత ఎంత విపరీతంగా ఫాలో అయ్యారు అంటే అడవి రాముడు సినిమా యువతను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఈ సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను  అన్న పాట కోటి రూపాయల పాటుగా ఆ రోజు నూంచి రోజుకి చరిత్రలో నిలిచిపోయింది. అయితే తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలీ అంటే అడవి రాముడు గురించి కచ్చితంగా విని తీరాల్సిందే.  ఇక మొత్తానికి తెలుగు సినిమాను అడవి రాముడు కు ముందు తర్వాత అనే అంతగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్ దే.. అయితే ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ హీరోగా రాముడు టైటిల్స్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ అడవి రాముడు క్రేజు - మోజు మాత్రం ఆ సినిమాలకు రాలేదు. అడవి రాముడు అంటే ఎప్పటికీ ఎన్టీఆర్ ఏ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: