టాలీవుడ్ ఇండస్ట్రీ లోని బడా ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు టాలీవుడ్ లో బడా హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు.. కథల సెలక్షన్ లో దిల్ రాజుకు ఎంతో అనుభవం వుంది.. ఆయన ప్రొడ్యూస్ చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.మిగతా నిర్మాతలు లాగా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేయకుండా, తక్కువ బడ్జెట్ లో కూడా సినిమాలు తీసి ఎక్కువ లాభాలు అందుకోవడం దిల్ రాజు ప్రత్యేకత..స్టార్ హీరోలతో  సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్ కంట్రోల్ తప్పకుండ చూసుకునేవాడు... కానీ రామ్ చరణ్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ విషయంలో ఆయన లెక్క తప్పుతుంది.. శంకర్ దర్శకత్వం లో సినిమా అంటే ఖర్చులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు..కేవలం పాటలకే ఆయన నిర్మాతలతో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిస్తారు.‘గేమ్ చేంజర్’ సినిమాకి అయితే కాస్త ఎక్కువగానే ఖర్చు అయినట్లు తెలుస్తుంది.

సినిమా షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో దిల్ రాజు కి బడ్జెట్ భారం భారీగా పెరిగింది..ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన గేమ్ ఛేంజర్  ‘ఇండియన్ 2’ కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో దిల్ రాజు తన ఫైనాన్షియర్స్ కి వడ్డీలు దాదాపుగా 350 కోట్ల రూపాయిలు కట్టినట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది..రామ్ చరణ్ ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. అలాగే శంకర్ రెమ్యూనరేషన్ కూడా 40 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం..గేమ్ ఛేంజర్ పూర్తి స్థాయి బడ్జెట్ అంచనా వేస్తె 650 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం.అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే  ఇప్పటికీ 250 కోట్ల రూపాయిల వరకు జరిగిందని, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా మరో 200 కోట్ల రూపాయలకు జరుగుతుందని సమాచారం.అయితే సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే దిల్ రాజు గట్టెక్కుతాడు లేకుంటే దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవు..

మరింత సమాచారం తెలుసుకోండి: