టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ ఏడాది రిలీజ్ చేసే విధంగా మేకర్స్ అనౌన్స్మెంట్ చేసిన ఇప్పటికి ఈ సినిమా విడుదల తేదీ మారుతోందనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాక్  తో సంబంధం లేకుండా పుష్ప -2 చిత్రం 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంత బలంగా ఈ సినిమా కథ ఉంటుంది అంటే చిత్ర బృందం అయితే ధిమాని వ్యక్తం చేస్తోంది. సుకుమార్ అద్భుత మాయ చేయగలరని విధంగా అభిమానులు నమ్ముతున్నారు.

సినిమా పైన ఉన్నటువంటి అంచనాల తగ్గట్టుగానే పుష్ప -2 సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని ముఖ్యంగా తెలుగు సినిమా థియేటర్ రైట్స్ బిజినెస్ లో సరికొత్త రికార్డును సృష్టించింది పుష్ప-2 అన్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా rrr సినిమా అని మించిపోయి మరి భారీ బిజినెస్ డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నైజాంలో 80 కోట్లు, ఆంధ్రాలో 85, సి డెడ్ లో 30 కోట్ల వరకు పుష్ప-2 సినిమా బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 195 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందట.


ఆర్ఆర్ ఆర్ కంటే ఎక్కువగా బిజినెస్ చేయడం గమనార్హం. ఈ బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే పుష్ప-2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా 200 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు స్టేట్లోనే బాహుబలి-2 ,RRR వంటి చిత్రాలు మాత్రమే 200 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్ట గలిగాయి..ఇటీవల కల్కి సినిమా కూడా 180 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.. మరి ఇలాంటి సమయంలో తెలుగులో పుష్ప-2 ఈ రికార్డులతో అల్లు అర్జున్ అన్నిటిని బ్రేక్ చేస్తారా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: