రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ వచ్చిన రెండు మూడు సినిమాలకే ఫేడ్డ్ అవుట్ అయిపోతూ ఉంటారు . కానీ రష్మిక మందన్నా రేంజ్ మాత్రం వేరే లెవెల్. వచ్చిన మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది . ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ బడా బడా ఆఫర్స్ అందుకునేసింది. అంతేనా సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ నేషనల్ క్రష్ గా ట్యాగ్ కూడా చేయించుకుంది .
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది . కాగా రష్మిక మందన్నా తన ప్రతి సినిమాకు చాలా చాలా ఆలోచించే సైన్ చేస్తుందట. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు రష్మిక మందన్నా ఒప్పుకున్న ప్రతి సినిమాకు కూడా కామన్ గా ఒకే ఒక కండిషన్ పెడుతూ వచ్చిందట . రష్మిక మందన్నా ఏదైనా సినిమాను ఓకే చేయాలి అంటే ఆ డైరెక్టర్ కి కచ్చితంగా కాల్ షీట్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ముందే చెప్పేస్తుందట .
రెమ్యూనరేషన్ అటు ఇటు అయినా పర్లేదు కానీ కాల్ షీట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కాల్ షీట్స్ మాత్రం అస్సలు ఇవ్వలేను అంటూ ముందుగానే తేల్చి చెప్పేస్తుందట . ఆ కండిషన్ కి ఓకే అయితేనే ఓకే వన్స్ కాల్ షీట్ ఫిక్స్ చేసుకున్నాక ..టైం షెడ్యూల్ కుదరలేదు అంటూ ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవ్వమంటే అస్సలు ఒప్పుకోను అని ..ఎంత పెద్ద డైరెక్టర్ కైనా కండిషన్ పెట్టేస్తుందట . ఒక్కవేళ ఏ డైరెక్టర్ అయిన అలా బలవంతం చేసి కాల్ షీట్స్ అడిగితే..ఆ సినిమా నుంచి తప్పుకుంటాను అంటూ కూడా తేల్చి చెప్పేస్తుందట. అందుకే కాబోలు రష్మిక లైఫ్ అలా జెడ్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్..!