ఆ తర్వాత తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన దానిపై సుప్రీయ మొదటి సాక్షిగా ఉన్నారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అనంతరం.. ఇవాళ రెండో సాక్షి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అయితే.. ఈ వాంగ్మూలాలను పరిశీలించి.. కోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే... తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ కు తాజాగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు.
అయితే....నాంపల్లి కోర్టు ఇచ్చే నోటీసుల ప్రకారం... కొండా సురేఖ....కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందట. ఒకవేళ తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ కోర్టు ముందు హాజరు కాకపోతే మళ్లీ... వేరే చర్యలు ఉంటాయి. స్థానిక పోలీసులకు నోటీసులు ఇచ్చి ఆమెను తీసుకురావాలని కోర్టు కోరే అవకాశాలు ఉంటాయని లాయర్లు చెబుతున్నారు.
ఏదేమైనా నాంపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులపై కచ్చితంగా... మంత్రి కొండా సురేఖ సమాధానం చెప్పాల్సి ఉంటుందని... అంటున్నారు. ఇక.. కోర్టు ముందుకు వచ్చి అక్కినేని నాగార్జునను ఎందుకు అనవలసి వచ్చింది...? ఎలాంటి రుజువులతో ఆ మాటలు అన్నారు...? అనే దానిపై కోర్టుకు సమాధానం కొండా సురేఖ ఇవ్వాల్సి ఉంటుంది అంట. ఒక వేళ కో ర్టు అడిగిన ప్రశ్నలకు కొండా సురేఖ సమాధానం ఇవ్వకపోతే.. 100 కోట్ల పరువు నష్టం దావ కట్టాల్సిందే అని చెబుతున్నారు.