ఈ సినిమాతో మరోచరిత్ర సృష్టించబోతున్నాడు బన్నీ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు . అంతేకాదు సుకుమార్ సైతం పుష్ప2 పబ్లిసిటీ ప్రమోషన్స్ వేరే లెవెల్లో చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు . కాగా ఇలాంటి టైం లోనే పుష్ప2కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపడింది. నిజానికి అల్లు అర్జున్ మంచి ఫుడీ. కడుపునిండా తినే టైప్ . అయితే తన సినిమాల విషయంలో ఎప్పుడు కూడా డైట్ పెద్దగా ఫాలో అవ్వడట .
కానీ పుష్ప1 అలాగే పుష్ప2 సినిమా విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతున్నాడట . స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్న తర్వాత బన్నీ ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక్కే డైట్ చేస్తూ వస్తున్నాడు . కానీ పుష్ప1 పుష్ప2 విషయంలో మాత్రం సపరేట్ డైటీషియన్ ని అపాయింట్ చేసుకుని మరి ఆయన చెప్పిన విధంగానే ప్రొసీడ్ అవుతున్నారట . అసలు చీట్ మీల్ అనేది పెట్టుకోలేదట . నిజంగా పుష్ప 2 కోసం బన్నీ చేస్తున్న హార్డ్ వర్క్ గ్రేట్ అని చెప్పాలి . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో...??