ఆ విషయం పక్కనపడితే సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురైయ్యె శ్రీజ చేత మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఊహించని పని చేయించబోతున్నాడట . ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నిజానికి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అనే ట్యాగ్ ఉన్న ఇండస్ట్రీకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదు. ఒక సినిమాలో నటించలేదు.. ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయలేదు. అయినా కానీ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోళింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది.
అయితే చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజ చేత కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయించాలి అని డిసైడ్ అయ్యాడట . అంతేకాదు ఇప్పటికే సుస్మిత సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది. రామ్ చరణ్ సైతం సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు . అదేవిధంగా నిహారిక సైతం సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది. శ్రీజ కి కూడా ఒక సపరేట్ లైఫ్ ఉండాలి ..తన కాళ్ళ మీద తాను నిలుచోవాలి.. ఇండస్ట్రీకి తన టాలెంట్ ఏంటో చూపించాలి అన్న కోణంలో ఆలోచించి చిరంజీవి ఈ డెసిషన్ తీసుకున్నారట . అయితే ఎప్పుడు కూడా శ్రీజ అంటే నెగిటివ్ యాంగిల్ లో చూసే జనాలు శ్రీజ ఎంతవరకు ఈ విషయం లో సక్సెస్ అవుతుందో అంటూ సందేహ పడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???