స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకు రావడంతో ఫ్యాన్స్ కి అయోమయ పరిస్థితి నెలకొంది . అసలు శ్రీ లీలకి ఎందుకు ఇలాంటి జబ్బు వచ్చింది ..? అంటూ ఫ్యాన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు. శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత జెడ్ స్పీడ్ లో దూసుకుపోయింది. 'ధమాకా' సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో హీరోయిన్గా చేరిపోయింది . ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల మాట్లాడుతూ.. తనకి ఒక వింత జబ్బు ఉంది అని చెప్పి షాక్ ఇచ్చింది.
ఆమె కి ఒక్కసారి తుమ్ము వస్తే కంటిన్యూగా 15 మినిట్స్ తుమ్ముతూనే తుమ్ముతూనే ఉంటుందట. అంతేకాదు దీనికి మెడిసినే లేదట . ట్రీట్మెంట్ అంటే మాత్రం నెమ్ముదిగకుండా చూసుకోవడమే . కూల్ వాటర్ తాగకుండా ..డస్ట్ పడకుండా ఎప్పటికప్పుడు హాట్ వాటర్ ను తాగుతూ ఉండడమే దీనికి ట్రీట్మెంట్ అట. ఇప్పటికీ శ్రీలీల ఎక్కడికి వెళ్లినా సరే తనకు కావాల్సిన వస్తువులను తానే తీసుకొని వెళుతుందట . అంతేకాదు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి జబ్బు రావడం ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా శ్రీలీల కెరియర్ లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటుంది..!