అదేంటి.. సినిమా ఫ్లాప్ అయితే పండగ చేసుకుంటారా..? అంటే అవును . మనకు నచ్చిన హీరో సినిమా హిట్ అయితే ఎలా ఆనందపడతామో ..మనకి నచ్చని హీరో సినిమా ఫ్లాప్ అయితే అలాగే ఆనందపడతాం. ఇది చాలామంది చేస్తూనే ఉంటారు . అయితే ఒక బడా హీరోయిన్ అలా చేయడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .

కొన్ని హిట్ అయ్యాయి ..మరి కొన్ని ప్లాప్ అయ్యాయి . అయితే తన కెరియర్ లో నటించిన "గుంటూరు కారం"  సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎదుర్కొన్నంత ట్రోలింగ్ మరి ఏ సినిమాకి కూడా ఎదుర్కోలేదు అనే చెప్పాలి . నిజానికి ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే ని అనుకున్నారు.  పూజా కార్యక్రమాలలో సైతం ఆమె పాల్గొనింది.  కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ను సినిమా నుంచి తీసేసారు .

ఆ తర్వాత ఆ ప్లేస్లోకి మీనాక్షి చౌదరి - శ్రీలీల ఆడ్ అయ్యారు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూసి నెగటివ్ గా కామెంట్ చేశారు. శ్రీలీల సైతం హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేసింది.  తనను కాదని వేరే హీరోయిన్ ని పెట్టుకొని సినిమా చేసినందుకు ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు పూజా హెగ్డే "గుంటూరు కారం" సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పెద్ద పార్టీ చేసుకుంది అన్న వార్తలు కూడా వినిపించాయి . తన క్లోజ్ ఫ్రెండ్స్ తో సరదాగా ఒక రిసార్ట్ లో గుంటూరు కారం.. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పూజా హెగ్డే పార్టీ చేసుకుందట.  అప్పట్లో ఈ న్యూస్ మహేష్ బాబు అభిమానులకి మండేలా చేసింది. ప్రసెంట్ మహేశ్ బాబు..రాజమౌళి సినిమా కోసం బాగా వర్క్ అవుట్స్ చేస్తున్నాడు..టోటల్ లుక్స్ మార్చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: